Home / SLIDER / ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్

ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం ఉదయం పదిన్నరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తన సొంతూరు అయిన చింతమడక గ్రామంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో గ్రామానికి చెందిన ప్రజలందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాపంక్తి భోజనాలు చేయనున్నారు.

అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ”గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ. పది లక్షల వరకు లబ్ధి చేకూరేవిధంగా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తామని ఆయన హామీచ్చారు.ఆయన ఇంకా మాట్లాడుతూ”చింతమడక గ్రామం తనను పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎవరు వద్దన్నా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.

రానున్న నెల రోజుల్లోనే చింతమడక గ్రామంలో సమస్యలను పరిష్కరించి సమస్యల్లేని చింతమడక గ్రామంగా తీర్చి దిద్దుతామని అన్నారు. ఈ గ్రామానికి 2వేల ఇళ్ళు మంజూరు చేయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.