Home / SLIDER / యువనేత కేటీఆర్ మార్గదర్శకం..!

యువనేత కేటీఆర్ మార్గదర్శకం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమాభివృద్ధి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందించాలనే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆలోచనను సిరిసిల్ల పట్టణంలో నిన్న గురువారం అమలుచేశారు. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభు త్వం అందించే కల్యాణలక్ష్మి చెక్కును సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేస్తుంటారు. నేరుగా ఇంటికే వెళ్లి ఇవ్వాలనే కేటీఆర్ సూచన మేరకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్‌కు చెందిన మోతె యశోద-గంగాధర్ దంపతులకు కొడుకు శ్యాంకుమార్, కూతురు శ్రావణి ఉన్నా రు.

గంగాధర్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తుండగా, యశోద బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నా రు. కూతురు శ్రావణి వివాహం మే 15న జరిపించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి కోసం వారు దరఖాస్తు చేసుకోగా రూ.లక్షా116 మంజూరైంది. ఈ సందర్భం గా టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్ బత్తుల వనజ ఆడబిడ్డలతో కలిసి లబ్ధిదారురాలు ఇంటికి వెళ్లి సారె పెట్టి చెక్కు అందజేశారు. దీంతో సదరు కుటుంబ సభ్యులు మురిసిపోయారు. స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.