Home / MOVIES / హీరో రాజ్ తరుణ్‌ కారుకు ప్రమాదం ..డివైడర్‌ను ఢీకొట్టి నాలుగు పల్టీలు

హీరో రాజ్ తరుణ్‌ కారుకు ప్రమాదం ..డివైడర్‌ను ఢీకొట్టి నాలుగు పల్టీలు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. TS09 Ex 1100 నంబర్ గల తన కారులో వస్తుండగా నార్సింగ్ పరిధిలోని అల్కాపూర్ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలుస్తోంది. అనంతరం నాలుగు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రాజ్‌తరుణ్‌ ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినట్టు తెలిసింది. కారు డివైడర్‌ను డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజ్ తరుణ్‌ తన కారులో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

యాక్సిడెంట్‌ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కారును రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృష్టం ఏమిటంటే కారులో ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడం వల్ల ప్రాణ నష్టం తప్పినట్లు పరిస్థితులు చూస్తే అర్థం అవుతోంది. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో కారులో రాజ్ తరుణ్‌ ఒక్కడే ఉన్నాడా..? లేక మరెవరైనా ఉన్నారా..? ఉంటే వారికి గాయాలు అయ్యాయా..? అన్నది మాత్రం తెలియరాలేదు. స్థానికులు మాత్రం రాజ్ తరుణ్‌ మాత్రమే ఉన్నాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ప్రమాద వివరాలు సేకరిస్తున్నారు.