బిగ్ బాస్ 3 మొన్నటితో ఐదు వారాలను పూర్తి చేసుకొంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నాగ్ ఎంట్రీ తరువాత ఇంట్లో సభ్యులను పలకరించాడు. ఈ ఆదివారం జరిగిన ఎపిసోడ్ మాత్రం నాగ్ ఫన్ గా మర్చేసాదని చెప్పాలి. టాస్క్ లతో సభ్యులను ఆడిస్తూ..డేంజర్ జోన్ లో ఉన్నవారిని ఒక్కొక్కరిగా సేఫ్ జోన్ కి పంపుతూ మంచి ట్విస్ట్ లతో గేమ్ ను ముందుకు నడిపించారు. అలా ఈ వారం షో బాగానే నడిచిందని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే అదే వైల్డ్ కార్డు ఎంట్రీ విషయానికి వస్తే దీనికి సంబంధించి కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. అందులో కే.ఎ.పాల్, ఈషా రెబ్బా, మనీషా ఎర్రబత్తిని, హైపర్ ఆది, వైవా హర్ష, యాంకర్ రవి, శ్రద్ధా దాస్, జబర్దస్త్ వేణు, హెబ్బా పటేల్, కమల్ కామరాజు ఉన్నారు….వీరికే బిగ్ బాస్ హౌజులోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని తెలుస్తుంది.