తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విధితమే..ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు అంటున్న సంగతి విధితమే.
అయితే తాజాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని. అందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ,పార్లమెంట్,జెడ్పీ ఎన్నికల ఫలితాలే నిదర్శమని ఆయన అన్నారు.