తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి-భువనగిరి జిల్లాలోని శ్రీలక్ష్మీ నరసింహా ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సంగతి విదితమే . అందులో భాగంగా యాదాద్రి ఆలయంలోని శిలలపై ముఖ్యమంత్రి కేసీఆర్,కారు గుర్తును చెక్కడంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,టీడీపీ,బీజేపీలకు చెందిన పలువురు నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.
ఈ వివాదంపై ఆలయ శిల్పులు స్పందిస్తూ”శిలలపై ఫలానా వాళ్ల బొమ్మలు చెక్కాలి. ఫలానా స్థలంలో వాళ్ల బొమ్మలు చెక్కాలి అని ఎవరు ఆదేశాలివ్వలేదు. ఇది కేవలం శిల్పకారులకు నచ్చిన విధంగా ..వారికి తోచింది చెక్కారు. కేవలం బాహ్యస్రాకారంలో మాత్రమే ఈ బొమ్మలు ఉన్నాయన్నారు. దీనిపై పెద్ద వివాదం చేయాల్సినవసరం లేదు. ఆహోబిలం ఆలయంలో గాంధీ,నెహ్రూ బొమ్మలు ఉన్నాయని ఈ సందర్భంగా వివరించారు.