తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ నెల ఎనిమిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఆ తర్వాత మంత్రిగా పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ”రాష్ట్రంలోని సర్కారు బడులను బలోపేతం చేయడానికి అందరు కల్సి రావాలని ఆమె పిలుపునిచ్చారు. బడుల్లో కనీస మౌలిక వసతులను కల్పించాలని.. నాణ్యమైన విద్యను అందించడానికి తమ సర్కారు పని చేస్తుందని ఆమె అన్నారు. గ్రామాల్లో పల్లెల్లో సర్కారు బడులను దత్తత తీసుకోవాలని ఆమె తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
