Breaking News
Home / MOVIES / ఈ హీరోయిన్ అంటే ..ఈ హీరోయిన్ కు ఇష్టమంట..ఎక్కువగా చూస్తాను

ఈ హీరోయిన్ అంటే ..ఈ హీరోయిన్ కు ఇష్టమంట..ఎక్కువగా చూస్తాను

టాలీవుడ్ లోకి  ‘ఉండిపోరాదే’ సినిమాతో కొత్త హీరోయిన్ పరిచయమైంది. ఆ హీరోయిన్ పేరు ‘లావణ్య’. అమె ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని వాఖ్యలు చూస్తే  “నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే శ్రీకాంత్ గారి సినిమా ‘అ ఆ ఇ ఈ’ సినిమాలోను, ప్రభాస్ ‘డార్లింగ్’ సినిమాల్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ తరువాత పూర్తిగా చదువుపైనే దృష్టిపెట్టాను. ‘భీమవరం’ కాలేజ్ లో బీటెక్ చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేశాను .. అవి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలోనే ‘ఉండిపోరాదే’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నాకు మంచి పాత్ర పడింది. నటనకి అవకాశం వున్న ఈ తరహా పాత్రలు చేయడానికి నేను ఆసక్తిని చూపుతాను. మొదటి నుంచి కూడా నాకు నిత్యామీనన్ నటన అంటే ఇష్టం. ఆమె సినిమాలు ఎక్కువగా చూస్తాను. హీరోయిన్ గా ఆమెలా మంచి పేరు తెచ్చుకోవాలని వుంది” అని చెప్పుకొచ్చింది.