Home / 18+ / రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రానికి గాను మెగాస్టార్ తనయుడు రాంచరణ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పై మెగా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్లు భారీగా చెయ్యాలని ఇలా చిన్నగా మామోలు సినిమాలా చేస్తే ఎవరూ పట్టించుకోరని అంటున్నారు. మరికొందరైతే ఇలా చేస్తే మెగా ఇమేజ్ మొత్తం పోతుందని, త్వరత్వరగా ప్రమోషన్లు చేస్తే మంచిదని హితబోధ చేసారు. మరి రాంచరణ్ ఏం చేస్తాడు అనేది వేచి చూడాల్సిందే.