ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులను అలరించే రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షోనే. ఈ షో మొదటి సీజన్ తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం రెండో సీజన్ లో కౌశల్ తో షో ఒక రేంజ్ కు వెళ్ళిపోయింది. ఈ మూడో సీజన్లో అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ హౌస్ లో ప్రస్తుతం గొడవలు, కామెడీ, టాస్క్ లతో అలా గడిచిపోతుంది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే..హిమజ, శ్రీముఖి, మహేష్, పునర్నవి మరియు శిల్ప చక్రవత్తి ఈవారం లిస్టులో ఉన్నారు. వీరిలో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన శిల్పా నే ఎలిమినేట్ అవుతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. శిల్ప హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి ఎవరితోనూ క్లోజ్ గా ఉండడానికి ఇష్టపడడంలేదు అంతేకాకుండా ఓట్లు పరంగా కూడా ఆమెకు తక్కువే వచ్చినట్టు తెలుస్తుంది. దాంతో ఈ వారం శిల్ప నే హౌస్ నుండి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.