Home / 18+ / “గ్యాంగ్ లీడర్” హిట్టా, ఫట్టా..?

“గ్యాంగ్ లీడర్” హిట్టా, ఫట్టా..?

టైటిల్: గ్యాంగ్ లీడర్
నటీనటులు: నాని, ప్రియాంక, కార్తికేయ, వెన్నెల కిషోర్, లక్ష్మి తదితరులు
సంగీతం: అనిరుద్ రవి చంద్రన్
దర్శకత్వం: విక్రమ్ కుమార్
నిర్మాత: మోహన్ చెరుకూరి, రవి శంకర్ యలమంచిలి, నవీన్
విడుదల: 13-09-2019

న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటించిన చిత్రం “గ్యాంగ్ లీడర్”. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వ భాద్యతలు చేపట్టారు. ఈరోజు అనగా 13-09-2019 నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు విక్రమ్ కుమార్ ఇష్క్, మనం లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలు తీయడంలో మేటి అని చెప్పాలి. నాని చివరి సినిమా జెర్సీ మంచి ఎమోషనల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఆశించినన్ని కలెక్షన్స్ అయితే రాలేదు. దాంతో నాని కోణంలోనే కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని రిలీజ్ చేసిన ఈ చిత్రం హిట్ అయ్యిందో లేదో తెలుసుకుందాం.

ఇక కధ విషయానికి వస్తే.. నాని ఇందులో పెన్సిల్ పార్ధసారధి పాత్రలో నటిస్తాడు. హాలీవుడ్ కధలు ఎంచుకొని వాటినే అటు ఇటు తిప్పి కాపీ చేసి అవే రివెంజ్ కధలుగా చూపిస్తాడు. ఇది పక్కన పెడితే మరోపక్క ఐదుగురు ఆడవాళ్ళు ఈ గొప్ప రివెంజ్ రచయిత దగ్గరకు సహాయం కొరకు వస్తారు. ఈ ఐదుగురు జీవితంలో జరిగిన సన్నివేశాలను మనోడు ఒక రివెంజ్ కధగా రాసి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. అయితే ఈ ఆడవాళ్ళు నాని ని ఏ సహాయం అడుగుతారు. కార్తికేయ, వాళ్లకు సంబంధం ఏమిటి, నాని వాళ్లకు సాయం చేస్తాడా లేదా అనేదే ఈ స్టొరీ. అయితే ఇక సినిమా పరంగా చూసుకుంటే ఇది ఒక కామెడీ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ కావడంతో ప్రేక్షకులు బాగానే ఆదరిస్తారు.

ప్లస్ పాయింట్స్:
*నాని నటన
*కామెడీ
*సంగీతం

మైనస్ పాయింట్స్:
*ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు లేదు.

రేటింగ్: 2.5/5

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat