Home / BUSINESS / మీకు బ్యాంకు ఖాతా ఉందా.. అయితే ఇది మీకోసమే.?

మీకు బ్యాంకు ఖాతా ఉందా.. అయితే ఇది మీకోసమే.?

మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు డైలీ బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారా..?. మీరు బ్యాంకుకు వెళ్లందే రోజు ముగియదా.? అయితే ఈ వార్త మీకు సంబంధించిందే..?. దేశంలోని బ్యాంకులన్నీటిని విలీనాన్ని చేస్తున్న కేంద్ర సర్కారు చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26,27న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న సంగతి విదితమే.

దీంతో ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రోజైన సెప్టెంబర్ 28న నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత రోజంటే సెప్టెంబర్ 29న ఆదివారం ఏలాగు బ్యాంకులకు సెలవు.

అంతేకాకుండా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ పరంగా సెలవుండటంతో బ్యాంకు అధికారులు తమ తమ బ్యాంకులకు చెందిన ఖాతాదారులను ఉద్ధేశిస్తూ వరుసగా ఆరు రోజుల వరకు బ్యాంకులు పనిచేయకపోవడం వలన ముందుగానే అవసరమైన డబ్బులను డ్రా చేసుకోవాలని “సలహాలు ఇస్తున్నారు.