Home / JOBS / మీకోసమే 12,074 ఉద్యోగాలు

మీకోసమే 12,074 ఉద్యోగాలు

మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే.

తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.

ఈ ఏడాది డిసెంబర్లోనే 7,8,14,15తేదీల్లో ప్రిలిమినరీ పరీక్షలు ఉంటాయి. వీటికి డిగ్రీ పూర్తిచేసిన వారు అర్జులు. అభ్యర్థుల వయస్సు 20-28ఏళ్లలోపు ఉండాలి. మిగిలిన విషయాల కోసం ఐబీపీఎస్ వెబ్ సైట్లో చూడోచ్చు.