Home / BUSINESS / ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్

దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబోతున్నాయి. దేశంలో ఉన్న పలు బ్యాంకులను విలీనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు,సిబ్బంది,అధికారులు రెండు రోజుల సమ్మెకు
పిలుపునిచ్చారు. ఈ నెల 26,27 తేదీలల్లో సమ్మె చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల 26,27లు వరుసగా గురువారం,శుక్రవారం బ్యాంకులు బంద్ ఉంటాయని వారు చెబుతున్నారు. అయితే ఆ తర్వాత రోజు
శనివారం నాలుగో శనివారం కావడం.. ఆ తర్వాత ఆదివారం కావడం మరి ఈ రెండు రోజులు బ్యాంకుల లావాదేవీలు ఉండేవాళ్ళు ముందే చూసుకోవాలని బ్యాంకు ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రకటించారు.