Home / MOVIES / పున‌ర్న‌విపై సంచలనమైన కామెంట్స్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌…వీడియో వైరల్

పున‌ర్న‌విపై సంచలనమైన కామెంట్స్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌…వీడియో వైరల్

తెలుగు బిగ్ బాస్ 3 ..సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఈ వారం గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు హోస్ట్ నాగార్జున.తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో త‌న‌దైన స్టైల్లో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌గా ఎంట్రీ ఇచ్చిన వ‌రుణ్ తేజ్ బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌తో క‌లిసి సంద‌డి చేశారు. ఈ ప్రొమో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఎందుకంటే శ్రీముఖి వ‌రుణ్ తేజ్ కు ప్ర‌పోజ్ చేసిన‌ప్పుడు అంద‌రూ చూస్తున్నారంటూ ఫన్ని కామెంట్స్ చేశాడు. తరువాత.. `నేను ప్ర‌పోజ్ చేయాలంటే చేతులు వ‌ణుకుతున్నాయి` అని పున‌ర్న‌వి చెప్ప‌గానే `ఆ అమ్మాయి నాకు చెప్ప‌లేక‌పోతోందంటే ఇంకెక్క‌డో చెప్పింది సార్‌` అని వ‌రుణ్ తేజ్ స‌మాధానం చెప్ప‌డంతో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టారిక్ గా మారిపోయింది.