Home / SECUNDRABAD / తగిన జాగ్రత్తలు పాటించాలి

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.
 
ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 2014 నుంచి తాము తీసుకున్న చర్యల వల్ల సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పరిస్థితులు మారిపోయాయని, పెద్ద సంఖ్యలో బస్తీలు ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పిందని తెలిపారు. మహమ్మద్ గూడా, షాబాజ్ గూడా, శాంతా శ్రీరామ్, అన్ననగర్, లాలాపేట ప్రాంతాల్లోని పెద్ద కల్వర్ట్లను విస్తరించమని, ముందుగానే నాలాల పుదిక్ తీసివేత, టేబుల్ డ్రైన్ ల పునర్నిర్మాణం వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే రూ.25 కోట్ల కౌసర్ మాజిద్, శాంతి నగర్, బ్రాహ్మణా బస్తి, ఇందిరా నగర్ నాలాల విస్తరణ పనులను చేపట్టామని, అవన్నీ తుది దశలో వున్నాయని వివరించారు. మధురానగర్ కాలని ప్రజల ఇబ్బందులను కూడా నివారించేలా భూగర్భ వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులను చేపదుతున్నామని తెలిపారు. అయినప్పటికీ ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా వివిధ శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
 
ఇందిరానగర్, ఫ్రైడే మార్కెట్, చంద్ర బాబు నగర్, మధురానగర్ కాలని, కౌసర్ మాజిద్, ఫిర్దౌజ్ మాజిద్ తదితర ప్రాంతాల ప్రజలు తాజా వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గుర్తించమని, పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షించి అధికారులను అప్రమతం చేశామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. నాలా పరీవాహక ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు నాలా లో ప్రవాహం సాఫీగా సాగేలా ఏర్పాట్లు జరపాలని ఆదేశించారు. మాన్సూన్ టేంలు నిత్యం అప్రమతంగా వుండాలని, ప్రతి డివిజన్ కు టీం ను ఏర్పాటు చేసామని తెలిపారు. చెట్ల కొమ్మలు కూలిన దశల్లో వెంటనే తొలగించాలని, వర్షాల వల్ల అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా జాగ్రతలు పాటించాలని ఆదేశించారు. ghmc ఉప కమీషనర్ రవికుమార్ మాట్లాడుతూ అన్ని విభాగాల మధ్య సమన్వయము ఎర్పరుచుకున్నామని, రాత్రంతా అన్ని విభాగాల సిబ్బంది విధులు నిర్వర్తించి అప్రమతంగా వ్యవహరించమని వివరించారు. corporator సామల హేమ, ghmc అధికారులు ప్రమోద్ కుమార్, డాక్టర్ రవీందర్ గౌడ్, పరమేష్ , తెరాస నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.