Home / ANDHRAPRADESH / టీడీపీ పైడ్ ఆర్టిస్ట్ లు ఆడిన మరో డ్రామా బట్టబయలు…ఈసారి పోలీసుల వేషంలో !

టీడీపీ పైడ్ ఆర్టిస్ట్ లు ఆడిన మరో డ్రామా బట్టబయలు…ఈసారి పోలీసుల వేషంలో !

ఏపీలో నూతన మద్య విధానం ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ పోలీసులు దగ్గరుండి ఈ మద్యం అమ్మకాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఎక్సైజ్ పోలీస్ మద్యం బాటిల్ విక్రయిస్తున్న ఫోటోతో పాటు మరి కొందరు పోలీసులు అంటూ టీడీపీకి చెందిన వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే అది నాటకం అని తేలిపోయింది కారణం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా సివిల్ ఎక్సైజ్ వివిధ రకాల పోలీసులు ఉన్నారు. హోంగార్డు కానిస్టేబుల్ ఎవరికి వారు తమ విధులు నిర్వహిస్తున్నారు. అయితే హోంగార్డు నుంచి  ఎంత పెద్ద అధికారి ఐన సరే నేమ్ ప్లేట్ లేకుండా ఏ పోలీసు అధికారి ఉండడు. కానీ టిడిపి ఆడిన నాటకంలో మాత్రం యూనిఫామ్ పై వారికి నేమ్ ప్లేట్ లు పెట్టడం మర్చిపోయారు. టిడిపి నేత మాజీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు వేషం వేసిన పలువురు ఆర్టిస్టులకు ఆటోలకు జగన్మోహన్రెడ్డి స్టిక్కర్లు అంటించమని ఆదేశాలిచ్చారు అంతేకాకుండా ఓ వీడియోను చిత్రీకరించి పోలీసులకు ఎలాంటి గతి పట్టింది అనే వ్యాఖ్యలు చేశారు. అదే సాక్ష్యాధారాలతో సహా వీరు చేసింది పెయిడ్ ఆర్టిస్టుల డ్రామా అని బట్టబయలు అయింది.