Home / Tag Archives: lokesh

Tag Archives: lokesh

వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు.. ఒకరికి ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

Read More »

YSRCP నేతలకు నారా లోకేష్ వార్నింగ్

ఏపీ అధికార వైసీపీపై టీడీపీ నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని, తమపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయట తిరగగలరా అని విమర్శించారు. తన నాన్న కాస్త సాఫ్ట్ కానీ.. తాను అలా కాదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలో వచ్చే ప్రజా ఉద్యమంలో జగన్ కొట్టుకుపోతాడని లోకేశ్ హెచ్చరించారు.

Read More »

జగన్ పై లోకేష్ విమర్షల వర్షం

ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత,సీఎం జగన్ పాలనలో రాష్ట్రం ఆత్మహత్యల ప్రదేశ్ మారిపోయిందని మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఉద్యోగం రాలేదని కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు వీరాంజనేయులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం.. వైసీపీ ప్రభుత్వం అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2.30 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరిన లోకేశ్.. యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు.

Read More »

సీఎం జగన్ కు లోకేష్ సలహా

ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేశ్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరో 3 వారాల్లో పరీక్షలు ప్రారంభం కానున్నందున కరోనా ఉద్ధృతి దృష్ట్యా అందరినీ పాస్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణ సహా 12 రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేశాయని గుర్తు చేశారు. విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారని, హైకోర్టు ఆదేశాలు లేదా ప్రతిపక్ష ఆందోళనల …

Read More »

లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …

Read More »

తెగ బాధపడుతున్న నారా లోకేష్..!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని  విమర్శించారు. విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ …

Read More »

మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు శ్రీకాకుళం జిల్లా రాజాంలో పోలీసులు అరెస్ట్ చేశారు. రామతీర్థం క్షేత్రాన్ని పరిశీలించేందుకు ఇటీవల వచ్చిన వైసీపీ ఎంపీ విజయసాయి కారుపై దాడి ఘటనలో కళా వెంకట్రావును అరెస్ట్ చేశారు. చెప్పులు విసిరిన ఘటనలో కళా అనుచరులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.

Read More »

జగన్ కు లోకేష్ వార్నింగ్

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు

Read More »

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి, తెలుగుదేశం శాసనసభాపక్షం ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎల్‌.రమణను కొనసాగించారు. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ప్రకటించారు. చాలా రోజుల క్రితమే ఈ కసరత్తును పూర్తి చేసినా మంచి రోజులు లేవనే కారణంతో ఆపారు. ఆదివారం నుంచి ఆ అడ్డంకి తొలగడంతో సోమవారం ప్రకటించారు. అచ్చెన్నాయుడి నియామకాన్ని …

Read More »