Home / ANDHRAPRADESH / మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్‌ నిధులు మల్లింపు..!

మనీలాండరింగ్, బ్లాక్ మెయిల్ కేసులు..రవిప్రకాశ్‌ నిధులు మల్లింపు..!

బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్‌ ఆలియాస్‌ ఖైదీ నెంబర్‌ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్‌… ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు, మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్‌ వన్‌ చానల్‌ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా… క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ డెస్క్‌ల్లో అయితే ఎంత మంది మారారో లెక్క పెట్టడం అంత ఈజీ కాదు.

అవినీతి రహిత, మెరుగైన సమాజం ముసుగులో టీవీ9 పేరు తో రవిప్రకాష్, మూర్తి, క్లిఫర్డ్ పెరార ల 18 కోట్ల దోపిడి అధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైల్లో వున్నాడు రవిప్రకాష్. అయితే ఇప్పుడు ఆయన మెడచుట్టూ ఈడి, సీబీఐ, మనీ లాండరింగ్, బ్లాక్ మెయిలింగ్ కేసులు కూడా చుట్టుకోనున్నాయా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

ఇప్పటికే రవిప్రకాష్ పై 420,418,409 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా టీవీ9  బహిష్కృత సీఈఓ  రవిప్రకాష్ పై ఆస్తులపై  ఈడీ విచారణ , రవిప్రకాష్ స్కాంలపై సీబీఐ విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాసిన లెటర్ ఇప్పుడు మీడియాతో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఫెమా,ఆర్బీఐ రెగ్యులేషన్,,మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రిమాండ్ లో వున్న రవిప్రకాష్ అక్రమాస్తులు కూడగట్టాడంటూ‌ విజయసాయి రెడ్డి పేల్చిన బాంబు పై ఇప్పుడు ఆధారాలు వేగంగా సేకరిస్తున్నారు.

దీనికి తోడు రవిప్రకాష్ తెలుగు రాష్ట్రాలలో దందాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకులను మోసం చేసిన మొయిన్‌కురేషి తోను , సీబీఐ  కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి‌ చాలా మందిని‌ మోసం చేసారని తన లేఖలో‌ ఆధారాలతో పేర్కొన ఆయన దీనిపై హోంమంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాసే అవకాశాలున్నాయని చెప్పు కుంటున్నారు. అమెరికాలో కమ్మ సంఘాలతో సంబరాలు జరిపే సతీష్ సానా, మొయిన్ కురేషి,రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో హైదరాబాద్ లోని నగల వ్యాపారి ముసద్దీలాల్ సుఖేష్ గుప్తను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని దానిపై కూడా విచారణ జరపాలని విజయసాయి రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరారు.

టీవీ9 సీఈఓ ఉన్నన్ని రోజులు ఇక్కడి అక్రమ సంపాదనతో‌పాటు ,లాండ్ సెటిల్‌మెంట్లు, బెదిరింపులు, సొంత సంస్థకే కన్నం వేసి‌ సున్నం‌పూసి సంపాదించిన అక్రమ సొమ్ములతో రవిప్రకాష్  ఆఫ్రికాలో పెట్టిన పెట్టుబడులను ఆధారలతో సహా బయటపెట్టాడు విజయసాయి రెడ్డి. హవాలా సొమ్ములను కెన్యా, ఉగాండాలో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టాడని, అవినీతి వ్యాపారాల జాబితాను, పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖలో తెలిపారు. ఈ ఫిర్యాదుపై ఎలాంటి యాక్షన్ వుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.  మనీ లాండరింగ్ సొమ్ములతో  వివిధ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన RP ఫ్యాక్టరీ సంస్థలలోకి ఆ నిధులను రవిప్రకాష్ పెట్టుబడి పెట్టారనే దానిపై ఉచ్చు బిగుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat