Home / MOVIES / బిగ్ బాస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ …డేంజర్ జోన్ లో ఉన్నది వీరే

బిగ్ బాస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ …డేంజర్ జోన్ లో ఉన్నది వీరే

బిగ్ బాస్ లో ఈ వారం ఇంటి సభ్యులు మొత్తం నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయిన ఈ ఏడుగురిలో ఎవరు ఇంటి నుండి వెళ్ళిపోతారనేది హాట్ టాపిక్ గా మారింది.ఈ ఏడుగురిలో శ్రీముఖి, బాబా భాస్కర్, రాహుల్, వరుణ్ లు సేఫ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. గడిచిన ఎపిసోడ్ లో ఆలీ వ్యవహార శైలి చర్చలకు దారి తీసింది. బాబా భాస్కర్ ఫ్యామిలీ వచ్చినపుడు ఆయన మాట్లాడిన విధానం ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఆయన పట్ల ప్రతికూలత వ్యక్తం చేస్తున్నారు. దాంతో వితికా కొద్దిగా పైకెళ్ళింది. అయితే శివజ్యోతి ఏడుపు వల్ల కూడా ఆమె నష్టపోయిందనే చెప్పాలి. ప్రతీసారి ఏడవటం ఆమెకి నెగెటివ్ గా మారింది. ఈ ప్రభావం ఓట్లపై చాలానే పడింది. వీరిద్దరి వ్యవహారం ఇలా ఉండటం వల్ల వితికా చాలా లాభపడింది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఆలీ చివరి స్థానంలో కొనసాగుతున్నాడు. బాబా భాస్కర్ గురించి శివజ్యోతితో మాట్లాడటం అతనికి పెద్ద మైనస్ అయింది. దానివల్ల ఆలీ డేంజర్ జోన్ లోకి వచ్చేశాడు. ఇక శివజ్యోతి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరంగా మారింది. అంతేకాదు ఈ వారం ఆలీ ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో అప్పుడే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ డబల్ ఎలిమినేషన్ ఉంటే గనక ఆలీతో పాటు, శివజ్యోతి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat