Home / SLIDER / తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందికి 67% జీతాలను పెంచింది. గతంలో ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వమే ఏకంగా ఆరు వందల శాతం నిధులను ఈ ఆరేళ్ల కాలంలోనే కేటాయించింది.

సంస్థ యొక్క ఆదాయం మొత్తం 4,882కోట్లు అయితే ఖర్చు మాత్రం రూ.5,811కోట్లతో ప్రతి ఏడాది నష్టం రూ. 1000కోట్లకు పైగా ఉండేది. మరి గతంలో ఉమ్మడి ఏపీలో ఆర్టీసీకి ఎంత ఇచ్చిందో.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత కేటాయించారో కింద పేర్కొన్న పట్టికలో గమనించోచ్చు..