Home / SLIDER / తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది.

అందులో భాగంగా వచ్చే నెల నవంబర్ నాలుగు లేదా ఐదో తారీఖున పురపాలక సంఘం ఎన్నికల నగరా మ్రోగనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నామని ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే పురపాలక సంఘాల పరిధిలోని ఓటర్ల జాబితా.. రిజర్వేషన్లకు సంబంధించిన పలు విషయాలను ఇప్పటికే పూర్తయ్యాయి అని వారు చెబుతున్నారు. పురపాలక సంఘం ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ నాలుగు లేదా ఐదో తారీఖున విడుదల చేసి .. ఈ ఎన్నికల ప్రక్రియను నవంబర్ ఇరవై ఐదో తారీఖు లోపు పూర్తి చేయనున్నట్లు వారు చెబుతున్నారు.