Home / ANDHRAPRADESH / అసెంబ్లీ కమిటీలను నియమించిన ఏపీ సర్కార్..!

అసెంబ్లీ కమిటీలను నియమించిన ఏపీ సర్కార్..!

రాష్ట్రంలో పలు అసెంబ్లీ కమిటీలను నియమిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు నూతనంగా చైర్మన్‌, సభ్యులను నియమించినట్టుగా పేర్కొంది. అందులో భాగంగా రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. దీంతోపాటు పిటీషన్  కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే సత్యనారాయణను నియమించటంపై అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీల వలన సమావేశాలతో పాటుగా చైర్మన్లకు తోడు సభ్యులు ఉండటం వల్ల ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించవచ్చని తెలుస్తోంది.