Home / SLIDER / నవంబర్ 15న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

నవంబర్ 15న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్నారు.

ఈ నెల పద్దెనిమిది తారీఖు నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలకు చెందిన ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు. సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాల గురించి చర్చించనున్నారు.