Home / MOVIES / రజనీకాంత్ ను అలా అన్నారా..

రజనీకాంత్ ను అలా అన్నారా..

సూపర్ స్టార్,స్టార్ హీరో రజనీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ దర్భార్. ప్రముఖ దర్శకుడు ఏ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాటలను నిన్న శనివారం విడుదల చేశారు. ఇందులో భాగంగా రజనీ తన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటన ఒకటి అందరితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ”16 వయదనిలే సినిమా తర్వాత ఒక ప్రముఖ నిర్మాత నన్ను హీరోగా పెట్టి సినిమాను తెరకెక్కిస్తానన్నారు. కానీ నేను ఆ సినిమా సెట్స్‌కు వెళ్లేవరకూ నిర్మాత నాకు అడ్వాన్స్ ఇవ్వలేదు. దీంతో నేను అడ్వాన్స్ ఇస్తేనే నటిస్తానని చెప్పాను.

ఆ నిర్మాత కోపపంతో ఊగిపోతూ ఏరా నీకంత పొగరా..నీకు సినిమాలో వేషం లేదు. నీ ఇంటికి వెళ్లిపో అని హెచ్చరించాడు. నిర్మాత ప్రవర్తనతో నాకు చాలా బాధ కలిగింది. ఆ సంఘనతో ఏర్పడిన కసితో ఎంతో కష్టపడి రెండున్నరేళ్లలో ఫారిన్ కారు కొన్నానని చెప్పుకొచ్చాడు.