Home / MOVIES / రామ్ చరణ్ తేజ్ ఔదార్యం

రామ్ చరణ్ తేజ్ ఔదార్యం

టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా కాంపౌండ్ కు చెందిన సూపర్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన అభిమాని కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవల మృతిచెందిన హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకోవడానికి చెర్రీ ముందుకొచ్చాడు. ఇందులో భాగంగా నూర్ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు.

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కారణంగా తిరిగొచ్చాక నూర్ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తానని ఆయన తెలిపాడు. నూర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన చెర్రీ మెగా అభిమానులందరిలోకెల్లా అతడు గొప్ప వ్యక్తి అని ఆయన గత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నాడు..