Home / 18+ / పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో భామలు ఎవరో తెలుసా..!

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ లో భామలు ఎవరో తెలుసా..!

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ పింక్ రీమేక్ తో అని ఇప్పటికే ఖరారైంది. వేణు శ్రీ రామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు , బోణి కపూర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ సంగీతం అందించనున్నారు. దిల్ రాజు ఆఫీస్ లో రికార్డింగ్ పనులు సైతం మొదలు పెట్టారట. ఇక ఈ సినిమాలో ఎవరు నటిస్తున్నారనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం ఫిలింసర్కిల్స్ లో ఇద్దరి భామల పేర్లు వినిపిస్తున్నాయి. మలయాళ ముద్దుగుమ్మ నివేద థామస్, తెలుగమ్మాయి అంజలి ఈ చిత్రంలో కీలక పాత్రలకు ఓకే అయ్యారట. ఇక ఇందులో మెయిన్ లీడ్ లో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఈ పాత్రకు పింక్ ఒరిజినల్ లో నటించిన తాప్సీ అయితేనే బావుంటుందని భావిస్తున్నా, తాప్సి బాలీవుడ్ బిజీ గా ఉండటంతో, ఆమె ఈ రీమేక్ కు కాల్ షీట్ ఇస్తుందా అనేది చూడాలి. ఒకవేళ ఇచ్చినా పవన్ కళ్యాణ్ కాల్ షీట్ తో తాప్సి షీట్ కలవాలంటే కష్టమే. చిత్ర యూనిట్ నుంచి అధికార ప్రకటన వెలువడాల్సివుంది.