KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా నటించిన ‘కె.జి.యఫ్ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. తాజాగా KGFఛాప్టర్ 2 కూడా అత్యంత వేగంగా తెరకెక్కుతుంది.
ఈ నేపథ్యంలో KGF ఛాప్టర్ 1 విడుదలైన రోజే KGF ఛాప్టర్ 2 ను విడుదల చేయాలని భావిస్తున్నామని చిత్రం యూనిట్ తెలిపింది. డిసెంబర్ 21న సాయంత్రం 5.45గం.లకు KGF ఛాప్టర్ 2 ఫస్ట్ లుక్ విడుదల కానున్నది. అయితే ఫస్ట్ ఛాప్టర్ హిట్ కావడంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.