Breaking News
Home / MOVIES / సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ కు ముహుర్తం ఖరారు

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువదర్శకుడు అనీల్ రావిపూడి.. తాజాగా అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు,అందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్లుగా సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి చేసుకుని ప్రోడక్షన్ వర్క్సు జరుపుకుంటుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి పదకొండో తారీఖున విడుదల కానున్నది.

ఈ రోజు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియమ్లో ఫ్రీ రీలీజ్ కార్యక్రమం నిర్వహించాలని చిత్రం యూనిట్ భావిస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. ఈ ఈవెంట్లోనే ట్రైలర్ ను రాత్రి 9.09గంటలకు విడుదల చేయాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేసింది చిత్రం యూనిట్.