Home / EDITORIAL / వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

వృక్ష రక్షకుడు – హరిత ప్రేమికుడు

దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం. పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం చాలా చల్లగా ఉండేది. ఎక్కడ చూసి నా తోటలు, పార్కులు, చెరువులతో కళకళలాడిన భాగ్యనగరం నేడు భాను డి ప్రతాపానికి విలవిలలాడిపోతున్నది. పాడి, పశువులు, చెట్లు అనాదిగా సాంఘిక జీవితంలో ప్రతి ఇంటిలోనూ ఒక భాగంగా వర్ధిల్లుతున్నాయి. చెట్టు మాట్లాడకపోవచ్చు.. కానీ, అది కూడా ప్రాణం కలిగిన వృక్షజాలంలోని ఒక అందమైన నేస్తం. ఇప్పుడంటే మనసులతో పాటు ఇండ్లు కూడా ఇరుకైపోయి, మొక్కకు కూడా చోటులేకుండా పోయింది. కానీ, కొన్ని దశాబ్దాలక్రితం వరకూ ఇంటిలో మనుషులతో పాటు మామిడి, కొబ్బరి, అరటి, వేపచెట్లను కూడా పెంచేవారు. బయట ఎండ మండిపోతున్నప్పుడు మామిడి చెట్టు కింద మంచం వేసుకుని కూర్చుంటే ఆ చల్లదనం ఇచ్చే హాయిని వర్ణించలేం. ఇక వీధుల్లో, రాష్ర్ట రహదారుల్లో రెండువైపులా విస్తారంగా చెట్లను పెంచేవారు. నడిచివెళ్లే బాటసారులు అలసట కలిగినపుడు ఆ చెట్ల కింద కూర్చుని విశ్రాంతి తీసుకునేవారు. చెట్టు మాట్లాడలేదు కానీ, దానికి కూడా మనసుంది. ప్రాణం ఉన్నది. తన దగ్గరకు ఎవరు వచ్చినా వారికి చల్లని నీడను ఇస్తుం ది.

తనను వంటచెరకు కోసం గొడ్డళ్లతో నరకడానికి వచ్చినవారికి కూడా నీడనిస్తుంది. తనను తెగనరికినా కిమ్మనదు. సంతోషంతో బాధను భరించి మళ్ళీ కొత్త చిగుళ్లు వేస్తుంది. కొమ్మలలో వేలాది పక్షులకు ఆశ్రయం ఇస్తుం ది. కమ్మటి ఫలాలను ప్రేమతో అందిస్తుంది. అందుకే చెట్టును దైవంగా భావించి కొలుస్తాం. రావిచెట్టును సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశగా భావించి ప్రదక్షిణలు చేస్తాం. మన బిడ్డలు పెరుగుతుంటే ‘చెట్టంత’ ఎదిగాడని సంతోషపడతాం. దీన్నిబట్టి మన దైనందిన జీవితంలో చెట్టు ఎంతగా పెనవేసుకుని పోయిందో అర్థమవుతుంది. నేడు దేశంలో అపార్ట్‌మెంట్‌ సంస్కృతి వెర్రితలలు వేసింది. ఈ అపార్ట్‌ మెంట్లలో చెట్లకు స్థానం లేదు.ఇరుకుగా ఉండే అపార్ట్‌మెంట్లలో కుండీల్లో చిన్న చిన్న పూలమొక్కలు వేసుకోవడం తప్ప చెట్టు, దాని హాయి అన్న ఊసే లేకుండా పోయింది. ఇక జాతీయ రహదారులు వచ్చాక రోడ్ల పక్కన చెట్టు అన్నది కనిపించకుండా పోయింది. ఫలితంగా గ్రీష్మతాపం పెరిగి, యాభై డిగ్రీల ఎండను చూస్తున్నాం.

పాతిక ముప్ఫయి ఏండ్లక్రితం హైదరాబాద్‌ లాంటి నగరాల్లో వాతావరణం చాలా చల్లగా ఉండేది. ఎక్కడ చూసి నా తోటలు, పార్కులు, చెరువులతో కళకళలాడిన భాగ్యనగరం నేడు భాను డి ప్రతాపానికి విలవిలలాడిపోతున్నది. రాష్ర్టం మొత్తం కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోతే వర్షాలు పడకపోవడం, పచ్చదనం కానరాకపోతే వెచ్చదనం పెరిగిపోవడం వెరసి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని భావించిన రాజసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ రాష్ర్టంలో మొక్కలను పెంచి హరితశోభితం చెయ్యాలని సంకల్పించారు. రాష్ర్టం అవతరించాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చదనం మీద దృష్టిని కేంద్రీకరించారు. రాష్ర్ట భూభాగంలో ఎనభై శాతం పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.గ్రామాల్లో సైతం మొక్కలు, చెట్లు పెంచా లని, ఆ విధంగా చెయ్యకపోతే పదవులనుంచి తొలగించడానికి కూడా వెనుకాడనని చెప్పడంతో తెలంగాణను హరితమయం చెయ్యడానికి అధికారు లు, నేతలు దీక్షబూనారు. కేసీఆర్‌ పట్టుదల కారణంగా తెలంగాణలో రోడ్ల కు ఇరువైపులా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ఒక ఉద్యమం లా ప్రారంభమైంది. నాలుగేండ్ల తర్వాత ఈరోజు తెలంగాణలో ఏ రోడ్డు వెంట ప్రయాణించినా, రోడ్లకు రెండువైపులా ఏపుగా పెరిగిన చెట్లు ఆనందబాష్పవాలు రాలుస్తూ ఉత్సాహంతో ఊగిపోతున్నాయి. శ్రీరాముడి ఆదేశాలను ఆంజనేయుడు శిరోధార్యంగా భావించినట్లు ముఖ్యమంత్రి ఆదేశాలను శిరస్సున దాల్చి సంతోష్‌కుమార్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.

అచిరకాలంలోనే ఇది ఒక ఉద్యమంగా ఊపందుకున్నది. ‘దయ చూపేవాడికన్నా దారి చూపేవాడు మిన్న’ అని చెబుతారు పెద్దలు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వకుండా, తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించారు సంతోష్‌ కుమార్‌. కీసర అరణ్యంలో సుమారు రెండున్నరవేల ఎకరాలను దత్తత తీసుకుని తన సొంత నిధులతో దుర్గమారణ్యంగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను స్వీకరించారు. మొక్కలు నాటడాన్ని ఒక ఉద్యమంగా తీర్చిదిద్దాడు.ఉచితంగా మొక్కలు పంపిణీ చేయిం చారు. సంతోష్‌ను స్ఫూర్తిగా తీసుకునేవారి సంఖ్య క్రమేణా పెరిగింది. ‘మీ ప్రయత్నానికి మేమూ చేదోడుగా నిలుస్తాం’ అని దేశం మొత్తం నినదించింది. దేశవ్యాప్తంగా ఉద్యోగులు, అధికారులు, సర్పంచ్‌ మొదలుకుని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు,సినిమా నటులు, క్రీడాకారులు కూడా ఈ హరితోద్యమంలో భాగస్వాములయ్యారు. హిందీ సినీ హీరో జాకీ షఫ్‌ ‘ఈ మధ్య వచ్చిన చాలా ఉద్యమాల్లో సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఛాలెంజ్‌ తనకు చాలా నచ్చిన కార్యక్రమం’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. కామెడీ షో నిర్వాహకుడు కపిల్‌ శర్మ కూడా సంతోష్‌ చేపట్టిన హరితోద్యమాన్ని కీర్తించారు.

సంతోష్‌ ఆకుపచ్చని దేశమే లక్ష్యంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరిం త చేరువ చేయడమే కాక, అనేకమంది ఔత్సాహికులను కూడా భాగస్వాములను చేయటానికి సరికొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు నాటినతను తనలాగే మొక్కల్ని నాటాలని మరో ముగ్గురిని నామినేట్‌ చేస్తారు. ఆ పిలుపును స్వీకరించిన ముగ్గురు ఒక్కొక్కరు మరో ముగ్గురిని నామినేట్‌ చేస్తారు. ఆ రకంగా అచిరకాలంలోనే లక్షలాది మందికి ఈ హరిత ఉద్యమం అల్లుకుని పోయింది. ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నవారిలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ప్రముఖ క్రీడాకారులు, సినిమా నటులు నాగార్జున, అమల, శ్రీకాంత్‌, మాగంటి మురళీమోహన్‌, సాయాజీ షిండే, మంచు లక్ష్మి, అలీ.. ఇంకా వందలాదిమంది బుల్లితెర కళాకారులు కూడా ఉండటం విశేషం. అంతే కాదు, కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ కూడా సంతోష్‌ కుమార్‌ మొదలుబెట్టిన గ్రీన్‌ ఇండియా గూర్చి విని ముగ్ధులై ఢిల్లీలోని తన నివాసంలో మూడు మొక్కలను నాటారు.

ఇప్పటివరకు సుమారు నాలుగు కోట్లకు పైగా మొక్కలను నాటినట్లు పత్రికలు ప్రచురించాయి. ఈ ఉద్యమానికి ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసై తమవంతు సహకారాన్ని అందించారు. ఫారెస్ట్‌ మాన్‌ అఫ్‌ ఇండియాగా ఖ్యాతినొందిన పద్మశ్రీ జాదవ్‌ పాయాంగ్‌ తెలంగాణ హరితహారాన్ని సెహబాష్‌ అంటూ మెచ్చుకున్నారు. ‘కీసరను దత్తత తీసుకోవడం, గ్రీన్‌ ఛాలెంజ్‌ నా జీవితంలో అత్యంత సంతృప్తిని కలిగించిన విషయాలు’ అంటూ వినమ్రంగా ప్రకటించే జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కృషిని మీడియా కూడా గుర్తించి ఆ కార్యక్రమం గూర్చి విశేషాలను ప్రచురించడం ప్రారంభించింది. పర్యావరణాన్ని, ప్రకృతిని రక్షించండి.. విపత్తులనుంచి అవి మనలను రక్షిస్తాయి! సంతోష్‌ కుమార్‌ కృషి ఫలించి తెలంగాణ మొత్తం నందనవనం, బృందావనంగా మారిపోతే.. ఆ దృశ్యం రోమాంచితం. బంగారు తెలంగాణ హరిత తెలంగాణగా మన ముందు ఆవిష్కృతమవుతుంది. ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పురస్కారాలు లభించాలని కోరుకుందాం.

-ఇలపావులూరి మురళీ మోహన్ రావు (సీనియర్‌ రాజకీయ విశ్లేషకుడు, రచయిత)