Home / Tag Archives: joginapalli santhosh kumar

Tag Archives: joginapalli santhosh kumar

తిరుమలేశుడి సేవలో ఎంపీ సంతోష్ కుమార్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎంపీ సంతోష్ కుమార్ దర్శించుకున్నారు. సతీసమేతంగా తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ‌ సమయంలో స్వామివారి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు సంతోష్‌ కుమార్‌ దంపతులకు ఆశీర్వచనం‌ అందించగా, టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వారికి స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు ఎంపీ సంతోస్‌ కుమార్‌ వివాహ వార్షికోత్సం కావడంతో …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రంగస్థలం సినిమాలో తన సహచర నటుడు శత్రువు (విలన్ పాత్ర) ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రామోజీ ఫిలింసిటీలో మొక్కలు నాటిన ప్రముఖ హీరో ఆది పినిశెట్టి. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం సోషల్ మీడియాలో మనం వివిధ రకాల …

Read More »

మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్

దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …

Read More »

థ్యాంక్యూ కేటీఆర్ అన్న‌య్య-ఎంపీ సంతోష్ కుమార్ ట్వీట్

త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ముక్కోటి వృక్షార్చ‌న‌లో పాల్గొనాలి అని రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. లేదా గిప్ట్ ఏ స్మైల్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పుష్ప‌గుచ్ఛాలు, కేకులు, హోర్డింగ్‌ల‌పై ఖ‌ర్చు పెట్టొద్ద‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌పై రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్ స్పందించారు. ముక్కోటి వృక్షార్చ‌న‌లో లేదా గిప్ట్ ఏ స్మైల్‌లో భాగ‌స్వామ్యం …

Read More »

దత్తత గ్రామానికి రూ.6కోట్లు మంజూరు

తన దత్తత గ్రామమైన కీసరలో సమస్యల పరిష్కారానికి మొదటి విడతగా రూ.6 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఎంపీ శ్రీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ గారు తెలిపారు. ఈనెల 1 నుంచి 10వరకు కీసర గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌కుమార్‌ కీసర గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. అదే సమయంలో గ్రామాభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, గ్రామంలో నెలకొన్న …

Read More »

IITA లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం వివిధ వర్గాల వారిని ప్రత్యేకంగా ఆకర్షిస్తు అందరిని భాగస్వామ్యం చేస్తోంది.శనివారం రోజు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (IITA) ఆవరణంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గారు, ఇంటలిజెన్స్ ఐజి ప్రభాకర్ రావు గారు, …

Read More »

మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ జోగినిపల్లి సంతోష్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు.ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ డివిజన్ లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తొలి మొక్కను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కలిసి నాటిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి …

Read More »

సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక ఇది: ఎంపీ సంతోష్

కోటి వృక్షార్చనలో భాగంగా నాటిన మొక్కలపై పక్షులు గూళ్లను ఏర్పరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని, ఇది సీఎం కేసీఆర్‌కు అద్భుతమైన కానుక అని టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఆధ్వర్యంలో ఎంపీ సంతోష్ కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. సంతోష్ పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐఆర్ఎస్ మియావాకి …

Read More »

టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు సంతోష్ కుమార్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే త‌న‌కు ఎలాంటి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని స్ప‌ష్టం చేశారు. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు తెలిపారు. ఒక వేళ బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే …

Read More »

వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …

Read More »