Home / ANDHRAPRADESH / పోలవరాన్ని ఈ స్థితికి నెట్టింది చంద్రబాబే.. సంచలన నిజాలు

పోలవరాన్ని ఈ స్థితికి నెట్టింది చంద్రబాబే.. సంచలన నిజాలు

తెలంగాణ సీఎంగా గద్దెనెక్కగానే కేసీఆర్ మొదటి ప్రాధాన్యతగా కాళేశ్వరాన్నిగుర్తించి మూడేళ్లలో పూర్తి చేసి ఇప్పుడు నీరిస్తున్నాడు  .. కానీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. పీఎంలు, రాష్ట్రపతిలను నామినేట్ చేసిన పెద్ద మనిషి చంద్రబాబు ఏపీకి తీరని అన్యాయం చేశాడని ఇప్పుడు కఠోర నిజాలు బయటపడుతున్నాయి. పోలవరంను ఆపాలని పునరావాసం కల్పించలేదని పక్కనున్న ఒడిషా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఎక్కడంతో చంద్రబాబు గారు పోలవరానికి పెట్టిన పంగనామాలు వెలుగులోకి వస్తున్నాయి.

*కనీస నిబంధనలు పాటించని చంద్రబాబు
పోలవరం లాంటి జాతీయ హోదా పొందిన ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు కనీస నిబంధనలు పాటించలేదనే విషయం వెలుగులోకి వచ్చింది. రాజకీయాలను పక్కన పెట్టి, కాంట్రాక్టర్ ప్రయోజనాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఇంజనీరింగ్ పద్ధతులు పాటించాలని స్పష్టమైన మార్గదర్శకాలు, పద్ధతులు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని విస్మరించి చంద్రబాబు ఐదేళ్ళపాటు సాగించిన నిర్మాణాలు ఇప్పుడు ప్రాజెక్ట్ కు గుదిబండగా మారాయి. అదే సమయంలో ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయే ముంపు బాధితులకు పునారావాస సహాయక చర్యలు ఏమాత్రం ప్రారంభించకపోవడం వల్ల తాజాగా అంతర్రాష్ట్ర వివాదం ఎదురై మళ్లీ సమస్య సుప్రీం కోర్టు గడపకు చేరింది. ఎప్పుడూ వివాదాల్లో ఉండే ఈ ప్రాజెక్ట్ బాబు ఐదేళ్ళ పాలన కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వల్ల మరింత వివాదాల్లోకి నెట్టేసి సమస్య ముదిరి పాకాన పడేలా చేసింది. ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పనులు ఆపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయంగానూ, రాష్ట్ర ప్రయోజనాల పరంగా ప్రాజెక్ట్ కు అవరోధాలు ఎదురవుతాయేమోనని ఆందోళన అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

* పునరావాసం కల్పించకుండా బాబు చేసిన ద్రోహం..
ఎవరైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపడితే కేంద్రం నిబంధనల ప్రకారం వారికి పునరావాసం ప్యాకేజీలు కల్పించాకే ప్రాజెక్టు మొదలుపెడుతారు.. కానీ పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు వీటిని గాలికి వదిలేశారు.. ఇప్పుడు అదే పోలవరం నిర్మాణానికి పెను అడ్డుగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్ల ఒడిశా రాష్ట్రంలోని ప్రాంతాలు ముఖ్యంగా గిరిజనులు నివసించే అటవి ప్రాంతాల ముంపునకు గురవుతున్నాయి. ఇప్పుడు ఒడిషా రాష్ట్రం ప్రాజెక్టును ఆపేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వెంటనే పనులు నిలిపివేసేందుకు ఆదేశించాలనే ఆ రాష్ట్ర విజ్ఞప్తిని సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలకు బలం చేకూర్చే విధంగా పునరావాస పునర్నిర్మాణ (ఆర్ఆర్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇవే ఇప్పుడు సమస్యగా పరిణమించాయి. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 51,424 కోట్లు అవుతుందని భావిస్తుండగా అందులో భూసేకరణ, ఆర్ఆర్ పనులకు 32,509 కోట్లు వ్యయం చేయాలి. పోలవరంలో నిర్మాణ పనులకన్నా వాటికే ఎక్కువ వ్యయం చేయాలి. 2013లో అమలులోకి వచ్చిన ఆర్ఆర్ చట్టం పటిష్టమైనది కావడంతో ఇప్పుడు జగన్ సర్కారు పోలవరం నిర్మించినా పునరావాసం కల్పించనిదే ప్రాజెక్టులో నీటి నిల్వ కష్టసాధ్యం..దీనికంతటికి నాడు చంద్రబాబు చేసిన నిర్లక్ష్యమే కారణమని చెప్పవచ్చు.

*చంద్రబాబు వల్లే ఇప్పుడు పోలవరానికి అడ్డుపుల్ల
అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ పోలవరాన్ని మొదటి ప్రాధాన్యతగా గుర్తించి రివర్స్ టెండరింగ్ తో కాళేశ్వరం నిర్మించిన మేఘాకు కాంట్రాక్టు కట్టబెట్టారు. వచ్చే ఏడాది పోలవరాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నారు. ఇదే చంద్రబాబు వల్ల పోలవరం ఆగిపోతుంటే.. మరో వైపు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరం పనులు నిలిచిపోయాయంటూ తెలుగుదేశం పార్టీతో పాటు వారికి అండగా ఉండే మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోంది.

*కాఫర్ డ్యాంతో చంద్రబాబు కుట్ర
కాఫర్ డ్యాంనే (అంటే జలాశయ నిర్మాణానికి నీరు అడ్డు రాకుండా నిర్మించే మట్టికట్ట) పోలవరం ప్రాజెక్టుగా చంద్రబాబు ఫోకస్ చేసి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారు. 2018 నాటికి డయాఫ్రం వాల్ నిర్మించి పోలవరం మొదటిదశ పూర్తి చేస్తామని బాబు చెప్పుకొచ్చారు. కానీ అది పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో కాఫర్ డ్యాంనే పోలవరం మొదటిదశగా చెప్పుకుని రాజకీయ లబ్ది పొందారు. కాంట్రాక్టర్ ప్రయోజనాల కోసం అప్పటి నుంచే ‘స్కెచ్’ వేసేశారని ఆరోపణలున్నాయి.. కానీ దానిని కూడా చేయలేకపోయారు.

*కేంద్రం నిధులిచ్చినా చంద్రబాబు ఏం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ ను జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించింది. నిర్మాణ పనులుకు మాత్రమే నిధులు సమకూరుస్తామని చెప్పింది. అంటే ఇతర భూసేకరణ, ఆర్ఆర్ పనులకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. గతంలో చంద్రబాబు ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడిచేసి సాధించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేపట్టలేదు.కాంట్రాక్టర్ మార్పు, తమ వారు సబ్ కాంట్రాక్టర్లుగా పనులు చేపట్టడం, స్పిల్ వేను విస్మరించి కాఫర్ డ్యాం నిర్మించడం మొదలైనవి ఆయన చేసిన ఘోరమైన తప్పిదాలుగా ఇంజనీరింగ్ నిపుణులు, ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి..
అప్పట్లోనే భూసేకరణ, ఆర్ఆర్ పనులు కేంద్రం చేపట్టే విధంగా ఒప్పించడంలో చంద్రబాబు విఫలమయ్యారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెస్తూ మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.

*బాబు వల్లే ఇప్పుడు పోలవరానికి మళ్లీ అడ్డంకులు
చంద్రబాబు వల్లే ఇప్పుడు పోలవరంపై ఒడిషా ప్రభుత్వం సుప్రీం కోర్టుకెక్కింది. తమ నిర్వాసితులను చంద్రబాబు పట్టించుకోలేని.. వరదతో వాళ్లు మునుగుతారని.. ప్రాజెక్టును ఆపాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ప్రాజెక్ట్ పూర్తవుతుంది కానీ ముంపు బాధితుల గురించి పట్టించుకునేవారు ఉండరు. ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నష్టపోయేవారిని క్షేమంగా ఇతర ప్రాంతాలకు ప్రత్యామ్నాయ వసతులతో నిర్మించకుండా తరలిస్తే ఆర్ఆర్ చట్టం ఒప్పుకోదు. అందువల్ల నీటిని నిల్వ చేయడం వీలుపడదు. అదే సమయంలో ఆర్ఆర్ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని గతంలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయడంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను ఆపివేసే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు ఇప్పుడు వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఏపీ కలల ప్రాజెక్టు పోలవరం ఆగిపోవడానికి ప్రధాన కారణం నాటి సీఎం, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat