Home / ANDHRAPRADESH / చంద్రబాబు అవినీతి అక్షరాల లక్ష కోట్లు

చంద్రబాబు అవినీతి అక్షరాల లక్ష కోట్లు

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దగ్గర పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇండ్లపై జరిగిన ఐటీ దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమాస్తులను పట్టుకున్నారు.

అధికారంలో తనకోసం నిర్మించుకున్న బినామీలు,పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలపై ఐటీ అధికారులు దాడులు జరిపితే లక్షల కోట్ల అవినీతి.. బ్లాక్ మనీ బయటకు వస్తుంది అని ఆయన ఆరోపించారు. చంద్ర్తబాబుకు ఉన్న నెట్ వర్కును చూసి ముంబాయి నగరానికి చెందిన కార్పోరేట్ సంస్థలన్నీ బిత్తరపోయాయి. ఇప్పుడు బయటకు వచ్చింది కేవలం ఉల్లిపాయపై పొర మాత్రమే. రావాల్సింది ఇంకా చాలా ఉంది. ఐటీ దాడులపై బాబు అండ్ బ్యాచ్,ఆయన మీడియా సంస్థలు ఇలా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటే తిన్నది ఇంకా అరగలేదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు.

దేశంలో ఏ రాష్ట్రంలో అయిన సరే సీఎం ప్రమాణ స్వీకారం ఉంటే తన వార్ని పంపించి మరి ఆహ్వానాలను తెచ్చుకునేవాడు. మరి ప్రస్తుతం ఎన్డీఏలో లేకున్నా ఇప్పుడు ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తోన్న అరవింద్ కేజ్రీవాల్ దగ్గరకు వెళ్తారా.అంత దమ్ము లేదు . ఒకవేళ వెళ్లితే బాబుపై ఉన్న పాతవి పద్దెనిమిది కేసులతో పాటుగా గతంలో అధికారంలో ఉన్న సమయంలో పాల్పడిన అవినీతి,కుంభకోణాలను మోదీ ప్రభుత్వం బయటకు తెస్తుందని బాబు భయపడుతున్నాడని ఆయన అన్నారు.