Home / 18+ / శ్రీకాంత్ ను పరామర్శించిన చిరంజీవి..!

శ్రీకాంత్ ను పరామర్శించిన చిరంజీవి..!

ప్రముఖ హీరో శ్రీకాంత్‌ తండ్రి మేక పరమేశ్వరరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలల్లో స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందడం జరిగింది. దాంతో సినీ ప్రముఖులు అందరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఇక సోమవారం నాడు మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వచ్చి ఆయన తండ్రి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం శ్రీకాంత్ మరియు ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.