చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన దేశంలో కానీ చికెన్ మటన్ లను చాలా అధిక ఉష్ణొగ్రతల్లో వండుతాం. దీంతో వీటికి అంటుకున్న కరోసా వైరస్ అధిక ఉష్ణోగ్రత వలన ఖచ్చితంగా చనిపోతుంది. కాకపోతే వండటానికి ముందు చికెన్,మటన్ లను ముక్కముక్కలుగా కూడా కోసే సమయంలో మన చేతులకు కరోనా వైరస్ ఉంటే వాటికి అంటుకుంది.
అయిన కానీ వాటిని పరిశుభ్రంగా కడిగి వండుతాము కాబట్టి ఆ వేడికి ఆ వైరస్ చనిపోతుంది. అయితే వండిన తర్వాత మన చేతులకు పరిశుభ్రంగా కడుక్కుని తింటే ఇది సోకదు అని వైద్యులు చెబుతున్నారు. దీని వలన ఆర్ధమైన విషయం ఏమిటంటే చికెన్ మటన్ ల వలన కరోనా రాదు అని..