Home / BUSINESS / దేశంలో పెట్రోల్ మంట

దేశంలో పెట్రోల్ మంట

దేశంలో పెట్రోల్‌ ధర పరుగుకు తెరపడటం లేదు. 13 రోజుల నుంచి వరుసగా ప్రతిరోజు పెట్రోల్‌ ధరలు మండుతూనే ఉన్నాయి.

శుక్రవారం పెట్రోల్‌పై 56 పైసలు, డీజిల్‌పై 63 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.78.37, డీజిల్‌ లీటరు ధర 77.06కి ఎగబాకింది.

వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో ఆమేరకు వ్యత్యాసం కనిపించనుంది. ఈ నెల 7 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌పై రూ.7.11, డీజిల్‌పై రూ.7.67 పైసలు పెరిగింది.