Home / ANDHRAPRADESH

ANDHRAPRADESH

ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టిన సోదరీమణులు

రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్‌ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ రక్షా బంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.

Read More »

వంగపండు మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు- సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతి వృత్తంగా పాటలు రాశారు.. రాసి పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

ఏపీ మాజీ మంత్రి కరోనాతో మృతి

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకుపెరుగుతుండగా.. మాజీ మంత్రి, బీజేపీ నేత పి.మాణిక్యాలరావు (60) ఈ మహమ్మారి కారణంగా చనిపోయారు. గత నెల రోజులుగా మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాకు గురై విజయవాడలోని ఓ ఆస్పత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఆయన.. కాసేపటిక్రితం ప్రాణాలు కోల్పోయారు. గత ప్రభుత్వ హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2014లో తాడేపల్లిగూడె నుండి గెలుపొందారు.

Read More »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా,ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు నియమితులయ్యారు. ఆయనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు . ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, ఆయన స్థానంలో వీర్రాజును నియమించారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన వీర్రాజా ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్నారు.

Read More »

అచ్చెన్నాయుడుకి బెయిల్ వస్తుందా…?

ఏపీలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన మాజీమంత్రి,టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి… బెయిల్ ఇవ్వాలా? లేదా? అనే దానిపై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి 45 రోజులు దాటింది. సాక్ష్యాల సేకరణ కూడా పూర్తయింది అటు ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ బెయిల్ పిటిషన్ …

Read More »

ఏపీ ఆర్టీసీలో కరోనా కలవరం

ఏపీ ఆర్టీసీలో కరోనా కలకలం రేపుతోంది.ఇప్పటివరకు మొత్తం 670 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తొలుత రోజుకు సగటున 5-10 మందికి కరోనా సోకగా ఇప్పుడు రోజుకు 60-70 మంది సోకుతుంది అత్యధికంగా కడప జోన్లో 260 మంది వరకు కరోనా బారిన పడ్డారు. కాగా ఆర్టీసీలో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఏం చేయాలనే అంశంపై మంగళవారం ఉన్నతాధికారులతో ఎండీ చర్చించనున్నారు.

Read More »

కరోనా కేసుల్లో ఏపీకి 4వ స్థానం

ఏపీలో ఇప్పటివరకు మొత్తం 1,02,349 కరోనా కేసులు నమోదయ్యాయి.. కేసుల సంఖ్యాపరంగా దేశంలో నాలుగో స్థానాన్ని ఏపీ చేరుకుంది. ఇక రోజువారీ కేసుల వృద్ధిపరంగా ఏపీ రెండో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 60 శాతం కరోనా కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. అటు కేసుల డబ్లింగ్ లో ఏపీ తొలి స్థానంలో ఉంది.

Read More »

వైరల్అయ్యినవన్నీ నిజాలు కానక్కర్లేదు

ఏపీలో చిత్తూరు జిల్లాలో కూతుళ్లతో కాడి పట్టించిన రైతు, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, సోనూ సూద్ స్పందించి ట్రాక్టర్ పంపించడం… ఈ వ్యవహారం మొత్తం అడ్డం తిరిగింది. — ఆ వీడియోలోని రైతు వీరదల్లు నాగేశ్వరరావు మదనపల్లె టౌన్లో ఉంటారు. కరోనా టైములో పల్లెటూరు సేఫ్ అని వాళ్ళ సొంతూరు వెళ్లారు. — కరోనా టైములో ఒక తీపి గుర్తుగా ఉంటుందని వాళ్లే స్వయంగా నాగలితో ప్రయత్నం …

Read More »

ఆ రైతుకు ఏపీ సర్కారు ఏమి చేసిందో తెలుసా..?

నటుడు సోనూసూద్‌. సహాయం చేసిన చిత్తూరు జిల్లా మహల్రాజుపల్లి రైతు నాగేశ్వర్రావుకు ఏపీ ప్రభుత్వంనుంచి అందిన సహాయం. వివరాలు 1. గత ఏడాది రైతు భరోసా కింద రూ. 13,500 నేరుగా నాగేశ్వర్రావు ఖాతాలో వేసిన ప్రభుత్వం 2. ఈ ఏడాది రైతు భరోసాలో భాగంగా ఇప్పటివరకూ రూ.7500 బదిలీ. మిగతా మొత్తం అక్టోబరులో, జనవరిలో బదిలీ. 3. నాగేశ్వర్రావు చిన్నకూతురుకు జగనన్న అమ్మ ఒడి కింద గత జనవరిలో …

Read More »

కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4

దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..

Read More »