Breaking News
Home / Tag Archives: trswp

Tag Archives: trswp

హైదరాబాద్  మెడలో మరో మణిహారం

తెలంగాణ  రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్  మెడలో మరో మణిహారం చేరనుంది. ఇ-కామర్స్‌ రంగంలో అగ్రగామి సంస్థ అమెజాన్‌ నగరంలోని నానక్‌రామ్‌గూడలో ఏర్పాటు చేసిన ప్రాంగణం ప్రపంచంలోనే అతిపెద్దది. పదివేల మందికి ఉపాధి కల్పించేలా పది ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ప్రాంగణం బుధవారం ప్రారంభం కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.అమెజాన్‌ ఇండియా సీనియర్‌ ఉపాధ్యక్షుడు, కంట్రీ మేనేజర్‌ అమిత్‌ అగర్వాల్‌, సంస్థ …

Read More »

పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్‌ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్‌ఎల్‌ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్‌రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే …

Read More »

సిరిసిల్లలో నేడు కేటీఆర్ పర్యటన

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్‌టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు …

Read More »

బీజేపీ నడ్డా నాటకాలు నడవవు

”తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడవవు. ఇతర రాష్ర్టాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోం. బీజేపీ నేతలు అధికార మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. కర్ణాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడ సాగవు. ఇది కర్ణాటక కాదు.. తెలంగాణ అని బీజేపీ నేతలు గుర్తుంచుకోవాలి”. అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి …

Read More »

తెలంగాణలో 2వ గ్రామంగా కొండాయిలుపల్లి

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది.   ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …

Read More »

రెండు కోట్లకు చేరిన గ్రీన్ ఛాలెంజ్

హరా హై తో భరా హై(పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జున ను …

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరో ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా జగద్విఖ్యాతి పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు..   తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్‌స్కేర్‌లోని భారీ తెరపై కాంతులీనింది. తెలంగాణ ఇంజినీరింగ్ ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్మించిన గాయత్రి పంప్‌హౌస్ విజువల్స్‌ను టైమ్స్‌స్కేర్ కూడలిలోని …

Read More »

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ సంబరాలు..

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో దోహా లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ సంబరాలు జరిగాయి.ఈ సంధర్భంగా ఖతర్ జాగృతి సభ్యులు నందిని అబ్బగౌని, స్వప్న చిరంశెట్టి గారు హజరైన వారందరికీ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగొని, ప్రధాన కార్యదర్శి వినాయక్ చెన్న గారు మాట్లాడుతూ వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , …

Read More »

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

స్వచ్చ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది . దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ …

Read More »

యాదాద్రిలో సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

Read More »