డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని రాష్ట్ర గిరిజన,స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడు కేసిఆర్ నాయకత్వంలో ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని, ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
ఉద్యమ వీరుని ప్రస్థానానికి పదమూడేళ్ళ పూర్తయ్యాయని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు కోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుత సందర్భం డిసెంబర్ 9 ప్రకటన అని తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీక్షతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ భారతదేశాన్ని కదిలించింది అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.