తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తల్లాడ, కల్లూరు, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలలో బీటీ రోడ్ల నిర్మాణాలు మరమ్మత్తుల కొరకు విజ్ఞప్తి మేరకు 70 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు హైదరాబాదు నందు రోడ్లు భవనాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని వారి కార్యాలయం నందు కలిసి శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు మరియు భవనాల శాఖ నుండి చేయూతగా 70 కోట్లు మంజూరు పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలియజేశారు.