తెలంగాణ రాష్టంలో నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల వద్ద ఉన్న ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం పనులను నీటి పారుదల శాఖ మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి ఈ రోజు ఉదయం 9 గంటలకు నేరుగా మంత్రి హరీష్ ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. మంత్రి హరీశ్ రావు వచ్చిన సమాచారం అందుకున్న ఉన్నత అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వద్దకు పరుగులు తీశారు. మంత్రి హరీశ్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఉన్నారు.
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు..
డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పం.. అందుకే రివ్యూ, పనులు వేగంగా సాగుతున్నాయి –మంత్రి జగదీశ్ రెడ్డి
ఉదయసముద్రం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడమే లక్ష్యం. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలో పనుల్లో అలసత్వం జరిగింది. జనవరి మొదటి వారంలో రిజర్వాయర్‌లో నీళ్లు పోయించడమే లక్ష్యం. అప్రోచ్ కెనాల్ పూర్తి అయింది. టన్నెల్ పనులు కూడా వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తాం.. నెలవారి టార్గెట్‌తో పనులు చేస్తున్నాం.. సీఈ సునీల్‌ని ఆదేశిస్తాం.. పంపు హౌజ్‌ను పూర్తి చేసి డిసెంబర్‌లో ట్రయల్ రన్ చేస్తాం. అక్టోబర్ నెలాఖరుకు సబ్ స్టేషన్‌ను పూర్తి చేస్తాం. జనవరి మొదటి వారంలో చెరువులు నింపాలని లక్ష్యం. కనీసం 50 వేల ఎకరాలకు నీరు ఇస్తాం. ఏఎంఆర్‌పి కెనాల్ పునరుద్దరణకు త్వరలోనే నిధులు – మంత్రి హరీశ్ రావు