తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత వరంగల్ మహానగరపాలక సంస్థ కు అవార్డుల వర్షం కురుస్తుంది.చారిత్రక నగరమైన వరంగల్ మహానగరానికి ఇటివల స్కోచ్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.ఐతే తాజాగా ఉత్తమ వారసత్వ నగరంగా మరియు స్వచ్చ నగరంగా అవార్డు వరించింది. అవార్డును డిల్లిలో రాష్ట్రపతి రామ్ నాద్ కోవింద్ మరియు కేంద్ర టూరీజం మంత్రి ఆల్ఫోన్స్ ఖన్నన్ తనమ్ చేతుల మీదుగా వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్,కలెక్టర్ అమ్రపాలి,కమీషనర్ శృతీ ఓజా అందుకున్నారు.
అభివృద్దిలో దూసుకుపోతున్న వరంగల్ ఈ అవార్డు రావటం పట్ల మేయర్ నరేందర్ హర్షం వ్యక్తం చేసారు.
ఈ సందర్బంగా మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర పతి రామ్ నాద్ కోవింద్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం ఆనందంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వరంగల్ మహానగరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి నగరాన్ని అభివృద్ది చేస్తున్నారని,ఆయనకు వరంగల్ నగరంపై ప్రత్యేక ప్రేమ ఉందని ఆయన కృషికి నిదర్శనమే ఈ అవార్డులు అని మేయర్ నరేందర్ అన్నారు.రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి నగరమైన వరంగల్ ను హైదరాబాద్ తో సమానంగా అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని అందుకే నగరానికి వరాలు ఇస్తున్నారని నగరం ఇంత గొప్పగా అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మేయర్ కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర పురపాలక శాఖా మాత్యులు శ్రీ కేటీఆర్ గారు పురపాలక శాఖపై చేస్తున్న విశేష కృషికి ఈ అవార్డులే నిదర్శనమని ,ఆయన నగరాభివృద్దిపై నిరంతరం సమీక్షిస్తూ,ఏమేం కావాలో తెలుసుకుంటూ అభివృద్దిలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా నగరాభివృద్దికి కృషిచేస్తున్నారని మేయర్ తెలిపారు.రాష్ట్ర పురపాలక శాఖా మంత్రిగా ఐటీ శాఖా మంత్రిగా తను బాద్యతలు తీసుకున్న తర్వాత పురపాలక శాఖ ను గొప్పగా నడిపిస్తూ రాష్ట్రంలోనే వరంగల్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దారని,నగర అభివృద్దికి నిరంతరం నిదులను కేటాయిస్తూ నగరం ఎలా ఐతే బాగుంటుందో మాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకునడిపిస్తున్నారని ఈ సందర్బంగా మంత్రి శ్రీ కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు .
వరంగల్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని అభివృద్దిపై పక్కా ప్రణాళికలతో ముందుకెలుతున్నామని నగరాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని మేయర్ అన్నారు.వరంగల్ గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరం,ఈ నగరానికి నిత్యం లక్షల పర్యాటకులు వస్తారని నగరాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతామని వరంగల్ నగరాన్ని రాష్ట్రంలోనే గొప్ప నగరంగా చేసే దిశగా కృషిచేస్తామని మేయర్ నరేందర్ అన్నారు.మా ప్రభుత్వ,పాలక వర్గం,సిబ్బంది పనితీరుకు అందిన గౌరవంగా ఈ అవార్డులను బావిస్తామని మేయర్ అన్నారు.నగర అబివృద్దికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కడియం శ్రీహరి గారికి ,రాష్ట్ర టూరిజాన్ని గొప్పగా అభివృద్ది చేస్తున్న టూరిజం శాఖామాత్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి మేయర్ ఈ సందర్బంగా దన్యవాదాలు తెలిపారు.
నగర అభివృద్దిలో కృషి చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కార్పోరేటర్లు,ఉద్యోగులు,సిబ్బందికి నగర ప్రజలకు ఈ సందర్బంగా మేయర్ నరేందర్ అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.