టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జైలవకుశ కలెక్షన్లు కురిపిస్తున్నాడు. నాన్నకుప్రేమతో, జనతాగ్యారేజ్, సెంచురీలు కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇదే వరుసలో విడుదల అయిన జై లవకుశతో మరో సెంచురీతో హ్యాట్రిక్ కొట్టాడు. జై లవకుశ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 21 ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయినా ఈ మూవీ.. వారం తిరిగే లోపే వరల్డ్ వైడ్‌గా 100 క్లబ్‌లో చేరడంతో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నందమూరి కల్యాణ్ రామ్ హర్షం వ్యక్తం చేస్తూ.. అభిమానులందరికీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించారు. ముఖ్యంగా జై పాత్రలో ఎన్టీఆర్ నటనకు అంత ఫిదా అయ్యారు.
