తెలుగు బుల్లి తెర ప్రేక్షకులని 70 రోజుల పాటు అలరించిన బిగ్ బాస్ టైటిల్‌ని చివరికి శివబాలాజీని వరించింది.ఎంతో ఉత్కంఠంగా సాగిన ఫైనల్‌లో హరితేజ,ఆదర్శ్ నిలుస్తాడని అందరు అనుకున్నా.. చివరకు శివబాలజికి అదృష్టం వరించింది. అయితే శివ బాలాజీ బిగ్ బాస్ నుండి 50 లక్షల ప్రైజ్ మనీ లబించింది. శివబాలాజీ టాక్స్ పోగా 35,00,000 పైగా వస్తుంది. ఒక వైల టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీ ఏం చేస్తారని బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే ఆ ప్రశ్న ఎదురవగా.. స్టేజ్ పై చెబుతానని చెప్పారు. తీరా ప్రైజ్ మనీ గెలిచాక ఆ విషయం మర్చిపోయారో సమయం లేక చెప్పలేదో తెలియదు. అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో శివబాలీజీ గురించి చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే బిగ్ బాస్ షో ద్వారా తనకు వచ్చిన ప్రైజ్ మనీని శివ అనాథ పిల్లలకు ఇచ్చాడని.. శివ బంధు వర్గం నుండి ఈ వార్త లీక్ అయ్యిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే శివ బాలాజీకి మాత్రం బిగ్ బాస్ షోలో 70 రోజులు ఉన్నందుకు అదనంగా 30లక్షలు వచ్చిందని సమాచారం.
