సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై జోస్యం చెప్పారు. బిగ్‌బాస్ ఫైనల్ విన్నర్ ఎవరనే ప్రశ్న ఎదురవడంతో ఫైనల్ ఫైవ్‌లో శివబాలాజీ గురించి చెబుతూ అతని జాతకం బాలేదని అతడు ఖచ్ఛితంగా గెలవడని వేణుస్వామి చెప్పారు. అయితే సంచలనాలకి మారు పేరైన వేణుస్వామి జోస్యం రివర్స్ కొట్టింది. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జోస్యం పై సెటైర్లు వేస్తూ.. ఫేమస్ అవడం కోసం దిగజారకుండా.. ఇకనైన ఎదవ జ్యోస్యాలు మానితే మంచిదని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
