పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. అయితే… ఈ డిమాండ్ ను మరో వర్గం అడ్డుకుంది. ఇక్కడ మొదలైన వివాదం దాడుల వరకూ వెళ్లింది. దాడుల్లో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మెగా అభిమానులు,అభిమానులే కొట్టుకుంటే సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి.
