మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఎన్ని ఏండ్లు అంటే ఎవరైనా సరే తడబడకుండా డెబ్బై ఏండ్లు అయింది అని ఎవరైనా చెప్తారు .గత డెబ్బై ఏండ్లుగా మన దేశం అభివృద్ధి చెండుతున్న దేశంగా ఇప్పటికి పుస్తకాల్లో..పేపర్లలో చదువుకుంటూనే ఉన్నాం .ఆఖరికి మన దేశాన్ని ఏలే నాయకులు ..ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు .
అయితే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏండ్లు అయిన కానీ దేశంలోని చాలా గ్రామాలకు ..పల్లెలకు కరెంట్ కాదు బస్ సదుపాయం లేదనేది ఎవరు కాదని సత్యం .తాజాగా అలాంటి గ్రామానికి చెందిన ఒక విషయం వెలుగులోకి వచ్చింది .అసలు విషయానికి వస్తే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయిన తర్వాత మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం అయిన అందేలికి కరెంటు తోపాటు బస్సు సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది.
మొత్తం ఆ గ్రామం లో దాదాపు 200 మంది నివసిస్తుంటారు. అంతే కాదు ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే అక్కడ ఉన్నవారు అందరు సక్కగా తెలుగులోమాట్లాడగలరు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామానికి కరెంటుగానీ, బస్సు సౌకర్యంగానీ లేదనే విషయం తెలుసుకొని ఆ సదుపాయాలన్నీ సమకూర్చాలని స్థానిక మంత్రి రాజే అంబ్రిశ్‌రావు నిర్ణయించి నిధులు సమకూరేలా చూశారు. దీంతో డెబ్బై యేండ్ల తర్వాత ఆ గ్రామానికి విద్యుత్, బస్సు సౌకర్యాలు వచ్చాయి .