బాహుబలితో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పై పుకార్లు కూడా ఎక్కువే. ముఖ్యంగా అఫైర్లకు సంబంధించి ప్రభాస్ పై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టయ్. నటి అనుష్కతో ప్రభాస్ కు అఫైర్ ఉందనే వార్త కూడా బాగా చక్కర్లు కొట్టింది. ఇదే విషయమై ఓ మీడియా సంస్థ ప్రభాస్ ను ప్రశ్నించగా… తనకు చాలా మొహమాటమని, వ్యక్తిగత విషయాలను బయటపెట్టడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పాడు. తన ప్రేమ, పెళ్లి గురించి తనను తరచుగా అడుగుతుంటారని… ఇలాంటి విషయాలపై స్పందించడం తనకు ఇష్టం ఉండదని అన్నాడు. పెళ్లి చేసుకుంటే, అందరితో చెప్పే చేసుకుంటానని తెలిపాడు.
అనుష్క గురించి మాట్లాడుతూ… తాను, అనుష్క ఇద్దరం ఒక నిర్ణయం తీసుకున్నామని..ఇలాంటి లింకులపై ఎక్కడా స్పందించకూడదని నిర్ణయించుకున్నామని ప్రభాస్ అన్నాడు. దాదాపు 9 ఏళ్ల నుంచి తాము ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉన్నామని.. ఇద్దరి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. మీడియాలో వస్తున్న విధంగా తమ ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక హీరో ఎవరైనా వరుసగా ఒక హీరోయిన్ తో రెండు, మూడు సినిమాలు చేస్తే.. వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు ప్రచారం జరుగుతోందని ఇది కరెక్ట్ కాదని అన్నాడు.