Home / SLIDER / సింగరేణిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…!

సింగరేణిలో గులాబీ జెండా ఎగరడం ఖాయం…!

  సింగరేణి ఎన్నికల్లో  గులాబీ జెండా ఎగరడం ఖాయం అని, అపవిత్ర కూటమిగా సింగరేణి ఎన్నికల్లో పోటి చేస్తున్న ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీకి ఓటమి తప్పదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఓట్ల కోసం కార్మికులకు మద్యం, డబ్బు పంపిణీ చేయడం నీతి బాహ్యమని, ఎన్ని కుప్పి గం తులు వేసిన సింగరేణిలో గులాబీ జెండా ఎగిరి తీరుతుందని స్పష్టం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో విలేకరు లతో మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో కార్మిక సంక్షేమ సంఘానికి, కార్మికుల హక్కులు హరించిన సంఘాల నడుమ పోటీ జరుగుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ నిరంతరం సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. తాము సింగరేణి కార్మికులకు ఏం చేశామో, ఏం చేస్తామో చెప్పాము కానీ ప్రతిపక్షాలు ఏమి చెప్పలేకపోయాయని ఆయన అన్నారు.