అశ్లీల వెబ్‌సైట్ల నిర్వాహకుడు దాసరి ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టాలీవుడ్‌లో ప్రముఖ హీరో, హీరోయిన్లు, సినీ ఆర్టిస్టుల ఫొటోలను మార్ఫింగ్ చేసి వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నాడంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేయడంతో దాసరి ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రదీప్ మొత్తం నాలుగు వెబ్‌సైట్లు నడుపుతున్నాడు. దాసరి ప్రదీప్ బిటెక్ చదివాడు. ప్రదీప్‌పై ఐటి యాక్ట్ ప్రకారం సెక్షన్ 67, సెక్షన్ 67ఏ ప్రకారం కేసులు నమోదు చేశారు. నేరం రుజువైతే ప్రదీప్‌కు, అతడికి సహకరిస్తున్నవారికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అశకాశం ఉంది.
